Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 7:37 pm Posted by : ramakrishna

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యార్థుల సత్తా

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

2026 జేఈఈ అడ్వాన్స్‌ డ్ పరీక్ష ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని కాకతీయ విద్యాసంస్థల చైర్‌పర్సన్ సి.హెచ్. విజయలక్ష్మి తెలిపారు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో కాకతీయ విద్యార్థులు విశిష్ట ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి సంస్థకు మరొకసారి కీర్తి తెచ్చిపెట్టారని ఆమె పేర్కొన్నారు. ఫలితాల్లో హెచ్. భరత్ ఆల్ ఇండియా ర్యాంక్ 1275, జె. తన్విత 1573, బి. సంధ్య 1627, ఆర్. బన్నీ 1334, ఎ. ఆత్రిజ్ 2361 ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు.

 

Nizamabad Kakatiya students excel in JEE Advanced results

 

ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్, ఐఐటియన్ సి.హెచ్. రామోజీరావు మాట్లాడుతూ, ఈ ఏడాది ఇంటర్మీడియట్, జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్‌తో పాటు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌లో కూడా కాకతీయ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు.

 

Nizamabad Kakatiya students excel in JEE Advanced results

 

విద్యార్థులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ తమ ప్రతిభను నిరూపించారని తెలిపారు. ఉన్నత ర్యాంకులు సాధించాలంటే స్కూలు స్థాయి నుంచే పటిష్టమైన ఫౌండేషన్ అవసరమని, రెగ్యులర్ సిలబస్‌తో పాటు ప్రతి సబ్జెక్టులో నిపుణులైన అధ్యాపకుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభవిష్యత్తు కోసం ప్రారంభ దశ నుంచే సరైన ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ డైరెక్టర్ సి.హెచ్. తేజశ్విని అభినందించారు. ఈ అద్భుత విజయాలకు కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బందికి చైర్‌పర్సన్ సి.హెచ్. విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

 

Nizamabad Kakatiya students excel in JEE Advanced results

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఏర్పడే ఆత్మీయ బంధాలకు ఈ ఫలితాలు నిదర్శనం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కళాశాలల ప్రిన్సిపాల్స్ సందీప్ కులకర్ణి, ఎ. రణధీశ్ శర్మ, అకాడెమిక్ కో-ఆర్డినేటర్ నాగరాజు, వైస్ ప్రిన్సిపల్ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇతర జిల్లాలు లేదా ఇతర బ్రాంచ్‌ల ఫలితాలు కాకుండా, నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు సాధించిన ఫలితాలేనని యాజమాన్యం స్పష్టం చేసింది.

 

Nizamabad Kakatiya students excel in JEE Advanced results