నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా పేరు తొలగించి ఇందూర్ జిల్లాగా పేరు మార్చాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్ డిమాండ్ చేశారు. గురువారం 25వ డివిజన్ నాయకులతో కలిసి పల్నాటి కార్తీక్ ఆధ్వర్యంలో మార్కెండేయ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..నిజాం నిరంకుశ పాలనకు గుర్తుగా ఉన్న నిజామాబాద్ ను ఇందూర్ జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగదీష్, నిరంజన్ చరణ్,రాకేష్, సంతోష్, యోగేష్ సాయి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.