నిజామాబాద్ జిల్లా జడ్పిటిసి, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు

 నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో  31 మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల పరిషత్ ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థలు జడ్పిటిసి, ఎంపీపీ  2025 షెడ్యూల్ ఖరారు నేపథ్యంలో రిజర్వేషన్ల జాబితా వెలువరించారు. నిజామాబాద్ జిల్లాలో  31  జడ్పీటీసీ స్థానాలకు గాను బీసీలకు 12, జనరల్ 10, ఎస్సీ 5, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించారు. మండల పరిషత్ స్థానాలు కూడా  బీసీలకు 12, జనరల్ 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించారు....