నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో 31 మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల పరిషత్ ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థలు జడ్పిటిసి, ఎంపీపీ 2025 షెడ్యూల్ ఖరారు నేపథ్యంలో రిజర్వేషన్ల జాబితా వెలువరించారు. నిజామాబాద్ జిల్లాలో 31 జడ్పీటీసీ స్థానాలకు గాను బీసీలకు 12, జనరల్ 10, ఎస్సీ 5, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించారు. మండల పరిషత్ స్థానాలు కూడా బీసీలకు 12, జనరల్ 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించారు. జడ్పిటీసీ, ఎంపిపీ స్థానాలలో మహిళలకు సగం స్థానాలు 14 కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, జనరల్ స్థానాలలో మహిళలకు అత్యధిక స్థానాలు దక్కించుకున్నట్టైంది.