Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 6:43 pm Posted by : ramakrishna

నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్  అసోసియేషన్  కార్యవర్గం ఎన్నిక

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ప్రింట్ మీడియా ) ఆవిర్భావం బుధవారము సాయత్రం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వివిధ పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్స్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నపత్రిక ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షుడిగా మల్లెపూల నరసయ్య(ప్రతిపక్షం దినపత్రిక ), అధ్యక్షుడిగా  కర్క రమేష్ (ప్రజాపక్షం దినపత్రిక ),ప్రధాన కార్యదర్శిగా తాళ్ళ శ్రీధర్ ( నినాదం దినపత్రిక ), కోశాధికారిగా కొక్కు రవి  కుమార్( నిఘానేత్రం దినపత్రిక ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఎండబెట్ల సదానంద్( తెలంగాణ వాణి దినపత్రిక  ),బ్యాగల శ్రీనివాస్ ( జనం సాక్షి దినపత్రిక  ),టి హరికృష్ణ (ధ్వని దినపత్రిక),కొట్టురి ప్రమోద్ ( క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఆంగ్ల దినపత్రిక )ఏకగ్రీవ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ఆర్గనైజింగ్ సెక్రటరీగా సి.ఎస్ జైపాల్( టైమ్స్ ఆఫ్ వార్త దినపత్రిక ),జయింట్ సెక్రెటరీలుగాషేక్ హైమద్ ( అక్షర విజేత దినపత్రిక)  అదేవిధంగా సలహాదారులుగాకొట్టురి శ్రీనివాస్ ( విజన్ ఆంధ్ర దినపత్రిక ),మాడవేడి శ్యాం కుమార్ ( విజయ క్రాంతి దినపత్రిక ), సభ్యులుగాప్రకాష్ ( సాక్షర దినపత్రిక ), శ్రీనివాస్ (ప్రజా జ్యోతి దినపత్రిక ) లను ఎన్నికయ్యారు.

Nizamabad District Staff Reporters Association Executive Committee Election