- వరంగల్ శ్రీనివాస్, రేలారే రేలా గంగా, అష్ట గంగాధర్
- ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపికకు అపూర్వ స్పందన
- గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించనున్న పాటలో జిల్లా కళాకారుల అవకాశం
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపికకు అపూర్వ స్పందన లభించిందని, నిజామాబాద్ జిల్లాలో గొప్ప కళాకారులకు పుట్టినిల్లు అని ప్రజా కవి, గాయకులు, సినీ గేయ రచయిత, సంగీత దర్శకులు వరంగల్ శ్రీనివాస్, రేలారే రేలా గంగా, ప్రముఖ గాయకులు అష్ట గంగాధర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కళాకారుల ఎంపికలు ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రెలారే రేలా గంగా సభ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా కవి, గాయకులు, సినీ గేయ రచయిత, సంగీత దర్శకులు వరంగల్ శ్రీనివాస్, ప్రముఖ పాటల రచయిత, గాయకులు మల్లిక్ తేజ హాజరయ్యారు. ఈ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 76 మందికి కి పైగా కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ..నూతన కళాకారులకు ఇది గొప్ప అవకాశం అని, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంత మంది కళాకారులు ఉండటం గొప్ప విషయం అని అన్నారు. ఈ రోజు ఎంపికలు నిర్వహించడం వల్ల మట్టిలో మాణిక్యాలతో పరిచయం ఏర్పడిందన్నారు. ఎంపికైన గాయకులతో ఆల్బమ్ పాడించనున్నామని అన్నారు. నిజామాబాద్ లో ఇంత చక్కగా ఎంపికలు ఏర్పాటు చేసిన నూరేండ్ల నాఊరు కళానేతలు రేలారే రేలా గంగా, అష్ట గంగాధర్, రాంపూర్ సాయి, సాయి లావోల, క్రాంతి లక్క, సహకరించిన కర్క రమేష్, పొగరీ సంజీవ్, మహేందర్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ పాటను ఒక్కో చరణం ఒక్కో కళాకారులతో పాడించాలని ఇలా ప్రతి జిల్లాలో ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాట రాయడానికి 25 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రేలారే రేలా గంగా మాట్లాడుతూ..ప్రముఖ ప్రజా కవి గాయకులు వరంగల్ శ్రీనివాస్ రచించిన నూరేండ్ల నా ఊరు గేయకావ్యం ఓయమ్మ నా పల్లెసీమ కోసం ఇంతమంది కళాకారులు హాజరవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. చాలామంది గ్రామాలలో ఎంతో టాలెంట్ ఉన్న నిరూపించుకోలేక పోతున్నారని, ఇలాంటి వేదికలు వారికి గుర్తింపునిస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి సాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఒక్క పాట రాయడమే ఎంతో కష్టమని అలాంటిది 243 చరణాలు రాయడం అంటే మామూలు విషయం కాదని, ఆ పాట రాసిన శీనన్నకు మా జిల్లా నుంచి కళాకారులకు ఈ పాటలో అవకాశం కల్పిస్తున్నందుకు గర్విస్తున్నామన్నారు. ఈ పాటలో కళాకారులకు పాడే అవకాశం రావడం వారి పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ పాటలు భాగస్వాములనేందుకు గర్విస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సీనియర్ కళాకారులు ఆర్టీసీ మల్లన్న, సవిత,దివ్య, అంజలి, వాడి రమేష్, మహేందర్,మనోజ, సాయి ధర్పల్లి, ప్రశాంత్, మహేష్ ఉమ్మడి జిల్లాల కళాకారులు పాల్గొన్నారు.
