నిజామాబాద్ చిన్నారి ప్రతిభకు పురస్కారం
వెబ్ డెస్క్, బతుకమ్మ : తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో గల లక్ష్మణ తీర్థం ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన నృత్యాంజలి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ 2026 సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ కు చెందిన చిన్నారి పి.కీర్తన (8 సంవత్సరాలు) తన నాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ తోట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్‌కు...