నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 వార్షిక ఎన్నికలకుగాను నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వుల మేరకు ఏర్పాటు అయిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీ ఛైర్మన్ ఆకుల రమేష్,సభ్యులు బాస రాజేశ్వర్,జి. నరసింహ రెడ్డి, శ్రీహరి ఆచార్య ల ఆదేశాల మేరకు ఎన్నిక అధికారులుగా నియమితులైన సీనియర్ న్యాయవాదులు జె.వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ .గౌడ్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ ఎన్నికల కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు.ఎన్నికల అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం బార్ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్ న్యాయవాది బట్టు మానిక్ రాజు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. క్రీడల కార్యదర్శిగా మంజిత్ సింగ్,కార్యవర్గ సభ్యునిగా మద్దెపల్లి శంకర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు వారు తెలిపారు. మార్చి 26 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తామని వివరించారు.