Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2025, 5:04 pm Posted by : ramakrishna

నిర్మల్ లో ఆట, పాట, మాట కవిసమ్మేళనం

  • ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ : హైదరాబాద్ చెందిన తెలంగాణ సాంస్కృతిక సంస్థ 12 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ కళలు, కలకారుల ఆట, పాట, మాట, కవిసమ్మేళనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కొరవి గోపరాజు సాహితీ సాంసృతిక సంస్థ వ్యవస్థపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ తెలిపారు.సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇట్టి బృహత్తర కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలకు చెందిన కవులు, కళాకారులు హాజరై విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు. ఈ వేదిక ద్వారా కవులకు, కళాకారులకు అవార్డులు ప్రధానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.