భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు కానున్న ఫ్యూజన్ పరిశ్రమకు వ్యతిరేకంగా తొమ్మిది గ్రామాల సర్పంచులు మంగళవారం వ్యతిరేక తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామంలో తొమ్మిది గ్రామాల సర్పంచులు, యువకులు ఫ్యూజన్ కంపెనీ నిర్మాణం పనులు ఆపివేయాలని కెమికల్ పరిశ్రమల వల్ల వచ్చే ఇబ్బందులను పెద్ద మల్లారెడ్డి సర్పంచ్ సాయ గౌడ్ ప్రజలకు వివరించారు. పరిశ్రమల స్థాపన సమయంలో గ్రామపంచాయతీ మొదలుకొని రెవెన్యూ కాలుష్య నియంత్రణ మండలి నీటిపారుదల శాఖ అగ్నిమాపక శాఖ కార్మిక శాఖ లాంటి 18 శాఖల అనుమతులు తప్పనిసరి అని ప్రజలకు వివరించారు. గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేసి ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు 9 గ్రామాల ప్రజలు ఉన్నారు.