Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 3:38 pm Posted by : ramakrishna

నిమిష ప్రియ మరణ శిక్ష అమలు వాయిదా..?

వెబ్ డెస్క్, బతుకమ్మ : యెమెన్ లో మరణ శిక్ష ఎదర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు కాస్త ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఆమె మరణ శిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో నిర్ణయించిన ప్రకారం.. జులై 16న ఈ శిక్ష అమలుచేయాల్సి ఉండగా.. చివరి క్షణంలో అధికారులు దీనిని నిలిపివేసినట్లు సమాచారం.