Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 1:05 pm Posted by : ramakrishna

నిఖత్ జరీన్ క్రీడాకారులకు ఆదర్శం : డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ : క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో తెలంగాణ స్పెషల్ పోలీస్  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాక్సర్ నిఖర్ బంగారుపతకం సాధించడంపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఫ్యామిలీ తరపున నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆకాంక్షించారు.