నైట్ డ్యూటీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి

 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేజీబీవీ లో పని చేస్తున్న అకౌంటెంట్లకు, వర్కర్లకు నైట్ డ్యూటీలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి అశోక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీబీవీలు విజయవంతంగా నడవడంలో టీచింగ్ సిబ్బందితోపాటు అంతకన్నా ఎక్కువ నాన్ టీచింగ్ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు....