Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 7:31 pm Posted by : ramakrishna

మదీనా కాలనీలో నవజత శిశువు లభ్యం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత మగ శిశువును వదిలివెళ్లిన ఘటన చోటు చేసుకుంది. మదీనా కాలనీ నివాస ప్రాంతంలో గురువారం ఎవరికీ కనిపించని ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలి వెళ్లారు. ఈ శిశువు నేడే పుట్టి ఉంటుందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిశువును వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.