కామారెడ్డి ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి
కామారెడ్డి, బతుకమ్మ: అప్పుడే పుట్టిన నవజాత శిశువు జన్మించిన కాసేపటికే మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన భవాని, సాయిలు దంపతులు. భవానికి బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని వేడుకున్నా వినిపించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున...