Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2025, 10:33 am Posted by : ramakrishna

కామారెడ్డి ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

కామారెడ్డి, బతుకమ్మ:

అప్పుడే పుట్టిన నవజాత శిశువు జన్మించిన కాసేపటికే మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన భవాని, సాయిలు దంపతులు. భవానికి బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని వేడుకున్నా వినిపించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయగా మొదటి కాన్పులో ఆడపిల్లి ( మహాలక్ష్మి) పుట్టిందని సంతోషించే లోపే శిశువు మృతి చెందింది.  కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. సేక్షన్ ల ప్రకారం ఆపరేషన్ ల నిర్వహణ పేరిట నిర్లక్ష్యం చేశారని, తాము కోరినట్లుగా బుధవారమే ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బతికేదని ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు