నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎల్లరెడ్డి పట్టణంలో వెలసిన భగలాముఖి అమ్మవారి శక్తిపీఠం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా ఆవిష్కరించారు. నగరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి క్రాంతి పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే కి ఆశీర్వచనాలు ఇచ్చారు. హైందవ ధర్మ రక్షణకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఇలాంటి సనాతన ధర్మ పరిరక్షకులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం ప్రతినిధి కట్కూరి సంతోష్, ప్రతినిధులు పాల్గొన్నారు.
