- భగ్నం చేసిన మద్నూర్ పోలీసులు
మద్నూర్, బతుకమ్మ : కొత్త పద్ధతిలో పైలట్ కార్ల సహాయంతో ముందుగా ఉంటూ పోలీస్ చెక్ పోస్టులను దాటించి టిప్పర్ల ద్వారా ఇసుకను మహారాష్ట్రకు తరలించాలనే కుట్రను మద్నూర్ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు నిఘా ఏర్పాటు చేసిన మద్నూర్ పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేక తనిఖీలలో రెండు టిప్పర్లు, రెండు పైటల్ కార్లను ఆపి తనిఖీలు చేశారు. తనిఖీలలో టిప్పర్లలో ఇసుక ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తులో ఇసుక నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు రెండు టిప్పర్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు టిప్పర్ డైవర్లను, కారుల్లో ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.