Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 4:16 pm Posted by : ramakrishna

నూతన పనులు గుర్తించాలి

బతుకమ్మ,మోర్తాడ్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో పంచాయతీ అధికారులు ఉపాధి హామీ సిబ్బంది గ్రామంలో చేయడానికి నూతన పనులను గుర్తించాలని మోర్తాడు ఏపీవో శకుంతల అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో ఆమె అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ పథకం అమలు అభివృద్ధి, ఇప్పటివరకు చేపట్టిన పనులు, వివరాలు ఖర్చులు, చేసిన వేతనాలు సామాగ్రి వివరాలు ఇప్పటివరకు కల్పించిన పని దినాలను వివరాలను రాబోయే ఆర్థిక సంవత్సరానికి లేబర్ బడ్జెట్ ప్రణాళిక తేదీల ఖరారు చేయడం కొత్త పనులు గుర్తించడం పై గ్రామ ప్రజలకు ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఏఎన్ఎం సద్గుణ, ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రమోహన్, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, గ్రామ మంచినీటి సహాయకుడు రాజకుమార్, గ్రామ ప్రజలు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.