లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రాలు అందజేత
రామారెడ్డి, బతుకమ్మ : కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రాలు, కుటుంబ సభ్యుల చేర్పు పత్రాలను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అందజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ రామారెడ్డి మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని 92 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రామారెడ్డి మండలంలో 704 నూతన రేషన్ కార్డులు మరియు 1457 పాత రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం పల్వంచ మండల కేంద్రంలోని రైతు...