Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:33 pm Posted by : ramakrishna

బిచ్కుందలో ఘనంగా నూతన ప్రైమరీ స్కూల్ ప్రారంభం

 

. . . ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం : ఎంఈఓ శ్రీనివాసరెడ్డి

 

. . . చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మున్సిపల్ చైర్మన్

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిచ్కుంద మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత ఫ్రీ ప్రైమరీ స్కూల్ ను మున్సిపల్ చైర్మన్ సీమ శెట్కార్, బిచ్కుంద ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపా రు. ఈ సందర్భంగా స్కూల్లో సరస్వతి మాతకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులకు మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కర్ అక్షర అభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు.

. . . ఆట వస్తువులతో ప్రత్యేక తరగతి గదులు

స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి.సంగమేశ్వర్ మాట్లాడుతూ పిల్లలను ఆకట్టుకునేలా రంగురంగుల ఆట వస్తువులు, ప్రత్యేక వసతులతో తరగతి గదులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత ఫ్రీ ప్రైమరీ స్కూల్ విద్య  ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తమ స్కూల్ సంబంధించిన భవనం మున్సిపల్ కార్యాలయానికి తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు అని దానిని విద్యార్థుల కొరకు వీలైనంత త్వరలో అప్పగించాలని మున్సిపల్ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా నూతనంగా నిర్మించిన మూడు తరగతి గదులకు సిమెంట్ ప్లాస్టింగ్ పనులు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా తమ స్కూలుకి ప్రత్యేక నూతన బోరు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మున్సిపల్ చైర్మన్ స్కూలుకు సంబంధించిన అన్ని సమస్యలను త్వరితగతిన పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.

 

New primary school inaugurated grandly in Bichkunda.