Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 5:29 pm Posted by : ramakrishna

ఎస్సైని సన్మానించిన నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై భూక్య సుమలతను ఇందల్వాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు దేగం నర్సయ్య, కార్యదర్శి కుపిర్యాల శ్రీధర్‌తో పాటు కార్యవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైకు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేగం నర్సయ్య మాట్లాడుతూ, ప్రజల సమస్యలు, ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ బాధితులకు నిష్పక్షపాతంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్సై భూక్య సుమలతను కోరారు. ప్రజలకు పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెంపొందేలా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు సయ్యద్ నయీముద్దీన్, ఉపాధ్యక్షుడు శ్రీపతి జితేందర్, సహాయ కార్యదర్శి పూజం రవికుమార్, కోశాధికారి ఎన్. శ్రీకాంత్ రెడ్డి, ఇన్‌చార్జి వైకుంఠం, సంయుక్త కార్యదర్శి పాశం నర్సింలు, సలహాదారులు కే. మధుసూదన్ రెడ్డి, బి. రాజేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మెండే అశోక్, జెగ్గ రాములు, దేగం పోచయ్య, జె. సురేందర్ తదితరులు పాల్గొన్నారు.