Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 5:21 pm Posted by : ramakrishna

ఇందల్వాయిలో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

 

. . . అధ్యక్షుడిగా దేగం నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా కుపిర్యాల శ్రీధర్

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరి దేగం నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా ప్రింట్ మీడియా విలేఖరి కుపిర్యాల శ్రీధర్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా నయముద్దీన్, ఉపాధ్యక్షుడిగా శ్రీపతి జితేందర్, సహాయ కార్యదర్శిగా పూజం రవికుమార్, కోశాధికారిగా ఎన్. శ్రీకాంత్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ఇన్‌చార్జిగా వైకుంఠం, సంయుక్త కార్యదర్శిగా పాశం నర్సింలు ఎన్నికయ్యారు. సలహాదారులుగా కే. మధుసూదన్ రెడ్డి, బి. రాజేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా మెండే అశోక్, జెగ్గ రాములు, దేగం పోచయ్య, జె. సురేందర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దేగం నర్సయ్య మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న జర్నలిస్టు సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సహకారంతో విలేకరులకు ప్రభుత్వపరంగా ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, హెల్త్ కార్డులు వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే పోరాటాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని కోరారు.