దేవునిపల్లి పాఠశాలకి కొత్త ఆశ

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని నాలుగో వార్డు దేవునిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు నుండి పెచ్చులూడి పడటం, గోడల బలహీనత, బేస్మెంట్ కూలిపోతుండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామ ప్రజలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, భవనం ప్రమాదకరంగా ఉండటంతో పాఠశాలకు పంపేందుకు నిరాకరించగా, ఖర్చులు భరించలేని స్థితిలోనూ ప్రైవేట్ పాఠశాలలకే తమ పిల్లలను పంపాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు...