కొత్త హెచ్ఐవీ కేసులు గుర్తించాలి
. . . జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో కొత్తగా హెచ్ఐవీ సోకిన వారిని అతి త్వరగా గుర్తించి, వారికి చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రాజశ్రీ అన్నారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాల్లో భాగంగా జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 0.32% ప్రివలెన్స్ ప్రకారం 5873 మందికి...