Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 September 2025, 6:02 pm Posted by : ramakrishna

రేపటి నుంచి కొత్త చరిత్ర ప్రారంభం

డిల్లీ, బతుకమ్మ :  కొత్త జీఎస్టీతో పేద మధ్యతరగతివారికి ఊరట కలగనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ( సెప్టెంబర్ 22 ) నుంచి కొత్త జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందని,  దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోందని మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి నూతన జీఎస్టీ శ్లాబు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు.  తర్వాతి తరం సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని రంగాలకు ప్రయోజకరమన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో అనేక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇక నుంచి 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయన్నారు. నాగరికత దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబుల్లోకి మార్చామన్నారు. చిన్న పరిశ్రమలే భారత్‌ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దిక్సూచిగా మారాయన్నారు. స్వదేశీ వస్తువులనే ప్రోత్సాహించాలని, మన దేశంలో తయారయ్యే వస్తువులనే కొనాలని, ప్రతి పౌరుడు స్వదేశి ప్రతిజ్ఞ తీసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.  స్వదేశీ వస్తువులను కొన్నామని గర్వంగా చెప్పాలని సూచించారు.