నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఐడీవోసీ టీఎన్జీవో కార్యాలయం లో ఎన్నికల అధికారి వనమాల సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం సర్వే & ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ యూనిట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సర్వే శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి సుధాకర్ టీఎన్జీవో నియమావళికి అనుగుణంగా, నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి సుమన్ కుమార్ మాట్లాడుతూ సర్వే శాఖ ఉద్యోగులందరూ సంఘటితంగా నిలిచి సర్వే శాఖ స్పెషల్ యూనిట్ జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం అవుటకు కృషి చేసిన ప్రతి ప్రాథమిక సభ్యుడిని అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వే శాఖకు టీఎన్జీవో సంఘం నందు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడానికి గల కారణాలను, సంఘం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీమారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్)ల సారథ్యంలో త్వరలో నిర్వహించే ఉద్యోగుల శంఖారావం కార్యక్రమానికి ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి, ఉద్యోగుల హక్కుల సాధన కొరకై నిర్వహించే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. అనంతరం సర్వే శాఖ స్పెషల్ యూనిట్ నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను పూలమాలతో సత్కరించి, అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను నూతన కార్యవర్గం బృందం పక్షాన ఘనంగా సన్మానించి, ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
