నిజమాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ ఆఫీసర్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని సీపీ కి వారు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం పాటుపడాలని, పోలీస్ శాఖ తరపున తమ సహాయ సహకారాలు అందిస్తానని సీపీ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో క్లబ్ ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతి రావ్, ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, జాయింట్ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి, క్లబ్ బాధ్యులు అంతిరెడ్డి రాజా రెడ్డి, దాస్, మీసాల సుధాకర్ రావ్, రంగూ దయాకర్ గౌడ్, స్వామి దాస్, దాస్, మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.