పూర్వ విద్యార్థుల ప్రోత్సాహంతో నూతన ఉత్తేజం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980-82 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాల పట్ల మమకారం చాటుతూ ప్రస్తుత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థుల అక్కరను గుర్తించి, విద్య ప్రోత్సాహక కార్యక్రమంగా వారికి నిత్యజీవితానికి ఉపయోగపడే సహాయం అందించారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గుండ్ల మహాలక్ష్మి (బైపీసీ) 915 మార్కులతో ఫస్ట్ ర్యాంక్, పవార్ నందిని (సీఈసీ) 842 మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించగా, ఇద్దరికి రూ.10,000/-...