హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్ టీఎన్జీవో కార్యాలయంలో మంగళవారం ప్రముఖ సమావేశం నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ని, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎస్.ఎస్.హుస్సేని ని టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. 2026-2029 కాల వ్యవధికి నిజామాబాద్ జిల్లా టీఎన్జివో ఎన్నికల్లె ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు నాశెట్టి కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ రాష్ట్ర కమిటీని కలిసి ధన్యావాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు టిఎన్జీవో రాష్ట్ర సహధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్కూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, శివకుమార్ గౌడ్, వివిధ యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు సూర్య ప్రకాష్, జ్ఞానేశ్వర్ రెడ్డి, నగేష్, మహేందర్, విశాల్, సునీల్, స్వామి, ఎడ్విన్ వినయ్ రాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.