Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 4:58 pm Posted by : ramakrishna

నేటి బందుకు న్యూడెమోక్రసి సంపూర్ణ మద్దతు

  •  న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య

 

మోపాల్, బతుకమ్మ : మోపాల్ మండల కేంద్రం లో న్యూడేమోక్రసి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కొరకు బీసీ సంఘాలు ఇచ్చిన అక్టోబర్ 18న జరిగే బందుకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మద్దతు తెలుపుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా  తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% శాతాన్ని చట్టంగా జీవో 9 ని విడుదల చేసింది. బీసీలకు స్థానిక సంస్థల తో పాటు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 42 శాతం చేయడాన్నీ జీర్ణించుకోలేని జాగృతి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టుకు పోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చెల్లదు అని కొన్ని వారాలు హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు అక్టోబర్ 18న రాష్ట్ర బందును ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల,రాజకీయంగా 42 శాతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని 18న జరిగే బందుకు మద్దతు తెలుపుతూ రాష్ట్రంలోని రైతులు, ప్రజలు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు రాష్ట్ర బంద్ లో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్ లొ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, న్యూడేమోక్రసి నాయకులు అగ్గు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.