లింగంపేట్ లో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బుధవారం రిబ్బన్ కట్టింగ్ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ద్వారాలు కాంగ్రెస్ కార్యకర్తలకు, అలాగే ఎల్లారెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, కార్యకర్తల అభిప్రాయాలకు ఈ కార్యాలయం వేదికగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నూతనంగా నియమితులైన డీసీసీ సభ్యులకు...