లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బుధవారం రిబ్బన్ కట్టింగ్ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ద్వారాలు కాంగ్రెస్ కార్యకర్తలకు, అలాగే ఎల్లారెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, కార్యకర్తల అభిప్రాయాలకు ఈ కార్యాలయం వేదికగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నూతనంగా నియమితులైన డీసీసీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్, ఏఎంసీ వైస్ చైర్మన్, సర్పంచులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
