Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 5:33 pm Posted by : ramakrishna

బోర్లం లో న్యూ కామన్ డైట్ మెను ప్రారంభించిన పొచారం

. . . మెస్ ను తనిఖి చేసి… విద్యార్థినీలతో కలిసి మధ్యహ్న భోజనం 

 బాన్సువాడ, బతుకమ్మ:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలకు గాను బాన్సువాడ మండలంలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు  లు ప్రారంభించారు.

New common diet menu has been launched in Borlam

 

అంతకుముందు శనివారం ఉదయం పాఠశాల మెస్ ను తనిఖీ చేసి కూరగాయలను, పప్పులను, వంట సామగ్రిని పరిశీలించారు. అనంతరం బాలికలతో కలిసి  పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజులు మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

New common diet menu has been launched in Borlam