వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ వ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో తిరుపతిలో జరుగుతున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఓ నవవధువు హాజరైంది. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం పెళ్లి ముహూర్తం కాగానే తిరుపతిలోని పద్మావతి పీజీ, డిగ్రీ కాలేజీలోని పరీక్ష కేంద్రానికి చేరుకొని పరీక్ష రాశారు.
