నాగల్గావ్‌లో నూతన అంగన్‌వాడీ భవన ప్రారంభం
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోమవారం ప్రారంభించారు. గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, మహిళలు, చిన్నారుల సమక్షంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. చిన్నారుల కు నాణ్యమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలల సమగ్ర అభివృద్ధికి...