ఆర్మూర్, బతుకమ్మ :
నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోసిన్ ప్రతి బుధవారం ఆర్మూర్‌లోని ఎంజే హాస్పిటల్‌లో అందుబాటులో ఉంటారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. మెదడు, వెన్నుపాము, నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నిపుణుల వైద్య సలహాలు, అవసరమైన చికిత్స అందించనున్నట్లు పేర్కొంది. తలనొప్పి, మైగ్రేన్, పక్షవాతం, మూర్ఛ, నరాల బలహీనత, చేతులు-కాళ్లలో తిమ్మిర్లు, జ్ఞాపకశక్తి సమస్యలు తదితర నరాల సంబంధిత సమస్యలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంజే హాస్పిటల్‌లో డాక్టర్ మోసిన్ రోగులను పరీక్షిస్తారని, నరాల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యాజమాన్యం కోరింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంజే హాస్పిటల్ సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ మధుశేఖర్, డాక్టర్ మోసిన్ పాల్గొన్నారు.
