నందిపేట్ లో నెహ్రూ జయంతి వేడుకలు
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలో స్వాతంత్ర్య సమరయోధులు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నెహ్రూ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాలతో మండలంలో నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.