చర్చల ప్రతినిధి గణేష్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌ మరో చర్చల పత్రినిధి గణేష్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ( చర్చల ప్రతినిధి), అలియాస్ ఉదయ్ మృతి చెందాడు. ఆయనతోపాటు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆయతోపాటు ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ అలియాస్‌ వెంకట రవి లక్ష్మి చైతన్య...