Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 1:38 pm Posted by : ramakrishna

మావోయిస్టులతో చర్చలు జరపండి

ఆపరేషన్ కగార్ పై కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన ప్రభుత్వ సలహాదారు కేశవరావు

హైదరాబాద్, బతుకమ్మ : ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి,  మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు కేశవరావు లేఖ రాశారు.  ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదన్నారు. 2004లో ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతియుతంగా చర్చలు జరిపిందని గుర్తు చేశారు. ఛత్తీస్గఢ్ ,తెలంగాణ బోర్డర్ నుంచి కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని లేఖలో కే కేశవరావు పేర్కొన్నారు.