బతుకమ్మ,బాల్కొండ: ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో ఏర్పాట్లు చేసి ఆస్పత్రులను ఏర్పాటు చేసి వచ్చే రోగులను చూడాలని వైద్యులను, కిందిస్థాయి సిబ్బందిని సైతం నియమించింది. కానీ బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉన్నా వచ్చే రోగులను నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోలేకపోవడంతో హాస్పిటల్ కు వచ్చే రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్కొండ కు చెందిన నహీమ్ అన్సారీ ఆటో డ్రైవర్ కాలికి గాయంతో ఆసుపత్రికి వచ్చారు. గంట సేపు ఎదురుచూసిన హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక తన కాలికి తానే అక్కడ ఉన్న మందులతో చికిత్స చేసుకున్నాడు. ఇప్పటికైనా సిబ్బంది స్పందించి వచ్చే రోగులను సక్రమంగా పట్టించుకోని చికిత్స చేయాలని పలువురు కోరారు.