ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో నిర్లక్ష్యం సహించేది లేదు
. . . తహసీల్దార్ బాలయ్య ఇందల్వాయి, బతుకమ్మ: ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా లోటుపాట్లు జరగకుండా అధికారులు, బీఎల్ఓలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య సూచించారు. సోమవారం ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి, గన్నారం, మెగ్యనాయక్ తాండా, కేకే తాండా, తీర్మన్‌పల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను తహసీల్దార్ బాలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియపై బీఎల్ఓలకు అవగాహన కల్పించి, ఫారాలను పంపిణీ చేసే ముందు...