Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 6:37 pm Posted by : ramakrishna

ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ – 2026 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలలో కలిపి 3334 విద్యార్థులు పరీక్షకు హజరు అవ్వాల్సి ఉండగా 3227 మంది విద్యార్థులు హాజరయ్యారు. 107 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. నీట్ పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దగ్గరుండి పర్యవేక్షించారు. ముందస్తు గా తీసుకున్న జాగ్రత్తల వల్ల పరీక్ష కేంద్రాలలో ఎక్కగా కూడా పొరపాట్లు జరగలేదని, పరీక్షలు సజావుగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.

 

NEET exam ends peacefully