Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 8:26 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నీల రవి

ఎల్లారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, నీల రవి ని ఎల్లారెడ్డి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నియమించినట్లు తెలియజేసింది. ఇప్పటి వరకు ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమ కార్యాచరణలో నీల రవి చూపిన నిబద్ధత, కృషిని గుర్తించిన ఎమ్మెల్యే మదన్మోహన్ ఆయనను ఈ బాధ్యతకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నీల రవి స్పందిస్తూ, ఇన్నాళ్లుగా పట్టణ స్థాయిలో పని చేసిన మమ్మల్ని గుర్తించి మండల కోఆర్డినేటర్ పదవికి నియమించినందుకు ఎమ్మెల్యే మదన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తను ముందుకు తీసుకెళ్లే విధంగా నా బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తాను అని తెలిపారు.