Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 5:45 pm Posted by : ramakrishna

వర్క్ ఇన్స్ పెక్టర్ పోస్టు కావాలి.. మీ సేవ కేంద్రం ఉండాలి

  • విధులకు ఎగనామం.. మీ సేవా కేంద్రం నిర్వహణ
  • నీటి పారుధల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం
  • విచారణ జరిపి చర్యలు తీసుకోని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్
  • జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిరుద్యోగిగా ఉన్నానని ఉపాధికోసం దరఖాస్తు చేసుకుంటే నీటి పారుదల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చింది నీటి పారుధల శాఖ. ఆ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన వర్క్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ద్వార వచ్చే జీతం ఏ మూలకు సరిపోదని స్వయం ఉపాధి కింద దరకఖాస్తు చేసుకుంటే మీ సేవా మంజూరు చేసింది అధికార యంత్రాంగం. దానితో సదరు వర్క్ ఇన్స్ పెక్టర్ రెండు పోస్టులకు న్యాయం చేయలేక చేతులేత్తేశారు. గత కొంత కాలంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం విధులకు హాజరు కాకుండా తన ఇంటివద్ద ఉన్న మీ సేవా కేంద్రాన్ని నిర్వహించుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని , సమయ పాలన పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించారు అధికారులు. ఇప్పటి వరకు అధికారులు విచారణ జరిపి నివేదికలు ఇచ్చిన, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దానికి కారణం పొలిటికల్ లీడర్ల ప్రెషర్ ఉండటమే కారణం అనే చర్చ జరుగుతుంది.

Need a work inspector post.. You should have a service center.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో నీటి పారుదల శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన వర్క్ ఇన్స్ పెక్టర్ పని చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండలంలో విధులు నిర్వహించే సదరు వర్క్ ఇన్స్ పెక్టర్ సమయ పాలన పాటించరని, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని కొందరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవల జిల్లాలో కురిసిన బారీ వర్షాల సమయంలో అన్ని శాఖలను అప్రమత్తంగా ఉండాలని అందులో ప్రధానంగా నీటిపారుదల శాఖల అధికారులను అప్రమత్తం చేసిన సదరు వర్క్ ఇన్స్ పెక్టర్ చెప్పా పెట్టాకుండా విధులకు డుమ్మాలను కొట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. దానితో జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారా లేదా అనే చర్చ జరగుతుంది.

మాక్లూర్ మండలంలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి పేరు మీదా నిజామాబాద్ నగరంలో మీ సేవా కేంద్రం ఉంది. అది నిబంధనలకు విరుద్ధంగా పొందినట్లు తెలిసింది. ఐతే గత కొన్ని రోజులుగా సదరు వర్క్ ఇన్స్ పెక్టర్ విధులకు హాజరు కాకుండా కేవలం మీ సేవా పైననే ధ్రుష్టిపెట్టినట్లు తెలిసింది. సదరు ఉద్యోగిపై 2024 లొ ఇద్దరు డిఇలు విచారణ జరిపి నిబంధలనలకు విరుద్ధంగా విధులకు గైర్హాజరు అవుతు మీ సేవా కేంద్రంను నిర్వహిస్తున్నట్లు గుర్తించి అధికారులకు నివేదికలను సమర్పించారు. కాని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా విచారణ నివేదికను పక్కదారి పట్టించారని, రాజకీయ నాయకుల అండతో దానిని తొక్కి పెట్టి ఉంచారని విమర్శలు ఉన్నాయి. విధులకు హాజరు కాకుండా పనిచేస్తున్న వర్క్ ఇన్స్ పెక్టర్ ను తొలిగించి కొత్తవారిని నియమిస్తారా అనే సంశయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి పేరు మీదా మీ సేవా కేంధ్రం మంజూరు చేయడం నిబంధనలకు విరుద్ధం. దానిపై చర్యలు తీసుకుంటారా అనే చర్చ కుడా జరుగుతుంది.

Need a work inspector post.. You should have a service center.