అవసరమైన ఎన్యుమరేటర్ లను నియమించుకోవాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఇంటింటి సర్వే కోసం అవసరమైన ఎన్యుమరేటర్ లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపీఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లో భాగంగా అవసరమైన ఎన్యుమరేటర్ లుగా ప్రైమరీ పాఠశాలల ఉపాద్యాయులను నియమించుకోవచ్చని తెలిపారు....