Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 6:10 pm Posted by : ramakrishna

అవసరమైన ఎన్యుమరేటర్ లను నియమించుకోవాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

కామారెడ్డి, బతుకమ్మ : ఇంటింటి సర్వే కోసం అవసరమైన ఎన్యుమరేటర్ లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపీఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లో భాగంగా అవసరమైన ఎన్యుమరేటర్ లుగా ప్రైమరీ పాఠశాలల ఉపాద్యాయులను నియమించుకోవచ్చని తెలిపారు. ఎన్యుమరేటర్ లకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఎన్యుమరేటర్ లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ ఏర్పాటుచేసి నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఓ రాజారాం, జడ్పీ సిఈఓ చందర్, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపీఒ లు, తదితరులు పాల్గొన్నారు.

Necessary enumerators should be appointed