Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 10:02 pm Posted by : ramakrishna

ఎమ్మెల్సీ కోదండరామ్ ను కలిసిన ఎన్డీఎస్ఎల్ కార్మికులు

బోధన్, బతుకమ్మ : ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ను శనివారం ఎన్డీఎస్ఎల్ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా బోధన్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ఎంప్లాయిస్ కు లే ఆఫ్ కాలానికి డిసెంబర్ 13, 2015 నుండి నేటి వరకు జీతాలు ఇప్పించాలని కోరారు.  అలాగే గ్రాడ్యువిటి రాని వారికి  గ్రాడ్యువిటి ఇప్పించాలని అన్నారు. ప్రభుత్వం బ్యాంకర్లకు ఎలాగైతే వన్ టైం సెటిల్మెంట్ కింద 200 కోట్ల రూపాయలను  గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో ఆ విధంగానే ఎంప్లాయిస్ కూడా ఇప్పించాలని ఎమ్మెల్సీ కోదండరాం ని షుగర్ ఫ్యాక్టరీ మజ్దూర్ సభ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఉపేందర్ శనివారం నిజామాబాద్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.