. . . నిజామాబాద్ ఎన్.సి.సి. గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేష్ కపూర్
. . . ఎన్.సి.సి.” సి” సర్టిఫికెట్ పరీక్ష విజయవంతం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్.సి.సి. దోహదపడుతుందని నిజామాబాద్ ఎన్.సి.సి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేష్ కపూర్ అన్నారు. జిల్లాలోని 12 తెలంగాణ ఎన్.సి.సి. బెటాలియన్ పరిధిలో ఆదివారం ఎన్.సి.సి.” సి” సర్టిఫికెట్ పరీక్షను గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో విజయవంతంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్.సి.సి.” సి” సర్టిఫికెట్ పరీక్ష అర్హత సాధించిన క్యాడెట్లకు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ వర్తిస్తుందని, క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తి, జాతీయత, వంటి భావాలతో ఎదగడానికి దోహదపడుతుందని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్యేక అధికారి 9వ తెలంగాణ ఎన్.సి.సి. బెటాలియన్ కరీంనగర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టైనెంట్ కల్నల్ ఏకే.జయంత మాట్లాడుతూ ఎన్.సి.సి.” సి” సర్టిఫికెట్ పరీక్ష దేశవ్యాప్తంగా జరుగుతున్నదన్నారు. నిజామాబాద్ పరీక్ష కేంద్రంలో మొత్తం 249 విద్యార్థులకు గాను, 247 మంది క్యాడెట్స్ పరీక్షకు హాజరయ్యారని, 2 క్యాడెట్లు గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ అనూజ్ రానా, మహేందర్, సత్తీందర్ జిత్ సింగ్, జహంగీర్ హుస్సేన్, ఎన్.సి.సి ఆఫీసర్స్ కెప్టెన్ బాబురావు, రాజేశ్వర్, లెఫ్ట నెంట్ డాక్టర్ రామస్వామి, నవీన్ కుమార్, సిటీవోలు, కార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
