నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు నిర్వహిస్తున్న దోస్త్ 2026-27 మొదటి విడతలో శుక్రవారం ఎన్.సి.సి, స్పోర్ట్స్ విభాగాల దృవపత్రాల పరిశీలన నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎన్.సి.సి నుంచి 20, స్పోర్ట్స్ నుంచి 14 మంది దృవపత్రాల పరిశీలనకు హాజరైనట్లు యూనివర్సిటీ దోస్త్ సమన్వయకర్త డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి అధికారి లెఫ్ట్ నెంట్ డాక్టర్ రామస్వామి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్. నేత, నరేష్ రవీందర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
